Big Boss Telugu
Big Boss Telugu

Telugu News

14:09 IST

TVS Creon: టీవీఎస్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి టీవీఎస్ క్రియాన్(TVS Creon) ఎంటరవుతోంది. 2023 జూన్ లో ఈ స్కూటర్ ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది.

టీవీఎస్ క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్
టీవీఎస్ క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్

TVS Creon features: వచ్చే సంవత్సరం మార్కెట్లోకి టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

30 November 2022, 14:09 ISTHT Telugu Desk
30 November 2022, 19:39 IST

TVS Creon: టీవీఎస్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి టీవీఎస్ క్రియాన్(TVS Creon) ఎంటరవుతోంది. 2023 జూన్ లో ఈ స్కూటర్ ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది.

టీవీఎస్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి టీవీఎస్ క్రియాన్(TVS Creon) ఎంటరవుతోంది. తాజాగా, ఈ స్కూటర్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన ఆటో ఎక్స్ పో లో కనిపించింది. ఇది ఇటాల్ జెట్ డ్రాగ్ స్టర్ అప్పీయరెన్స్ లో ఉంది. 2023 జూన్ లో ఈ స్కూటర్ ను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది.

ట్రెండింగ్ వార్తలు

TVS electric scooter: సెకన్లలో 60 కిమీ వేగం

ఈ టీవీఎస్ క్రియాన్((TVS Creon)లో 16 పీఎస్ ఎలక్ట్రిక్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 5 సెకన్లలోనే సున్నా నుంచి 60 కిమీల వేగాన్ని అందుకుంటుంది. పెరిమీటర్ ఫ్రేమ్ తో పాటు, యాంగ్యులార్ డిజైన్ తో డైనమిక్ లుక్స్ లో ఉంది. ఎల్ ఈడీ లైటింగ్, బ్లూటూత్ సదుపాయం ఉన్న డిజిటల్ కన్సోల్ ఉన్నాయి. చాలా స్పోర్ట్స్ బైక్స్ ను మించిన అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపర్చారు.

TVS Creon battery: స్పీడ్ చార్జింగ్

ఈ స్కూటర్ లో ర్యాపిడ్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. గంటలో 80% వరకు బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా కూడా బ్యాటరీ పాక్షికంగా చార్జ్ అవుతుంది. మూడు రైడింగ్ మోడ్స్, జియో ఫెన్సింగ్, జీపీఎస్, పార్క్ అసిస్ట్, సేఫ్టీ, యాంటీ థెఫ్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఏబీఎస్ ఫెసిలిటీతో రెండు వీల్స్ కు డిస్క్ బ్రేకులను అమర్చారు.

TVS Creon: అందరికీ అనుకూలంగా..

యువతనే కాకుండా, అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునేలా ఈ TVS Creon ను తీర్చిదిద్దారు. దీని ధరల శ్రేణిని సంస్థ ఇంకా ప్రకటించలేదు. కానీ, ఇది సుమారు రూ. 1.2 లక్షల శ్రేణిలో ఉండవచ్చని భావిస్తున్నారు. 80 కిమీల రేంజ్ తో మూడు లిథియం ఇయాన్ బ్యాటరీలు ఇందులో ఉన్నాయి.

టాపిక్

13:23 IST

అఫ్గానిస్తాన్ లో బుధవారం జరిగిన భారీ పేలుడులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అఫ్గానిస్తాన్ లోని సమాంగన్ రాష్ట్రంలో ఈ పేలుడు సంభవించింది.

బాంబు పేలుడు జరిగిన ప్రదేశం దగ్గరలో తాలిబన్ పోలీసులు
బాంబు పేలుడు జరిగిన ప్రదేశం దగ్గరలో తాలిబన్ పోలీసులు (AFP)

Blast in Afghanistan kills 16: భారీ పేలుడులో 16 మంది దుర్మరణం

30 November 2022, 13:23 ISTHT Telugu Desk
30 November 2022, 18:53 IST

అఫ్గానిస్తాన్ లో బుధవారం జరిగిన భారీ పేలుడులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అఫ్గానిస్తాన్ లోని సమాంగన్ రాష్ట్రంలో ఈ పేలుడు సంభవించింది.

Blast in Afghanistan అఫ్గానిస్తాన్ లో బుధవారం చోటు చేసుకున్న భారీ పేలుడులో 16 మంది చనిపోయారు. వారిలో అత్యధికులు విద్యార్థులే. అఫ్గానిస్తాన్ లోని సమాంగన్ రాష్ట్రంలో ఉన్నఐబక్ పట్టణంలో ఈ పేలుడు చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Blast in Afghanistan మదరసాలో..

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ కు ఉత్తరంగా 200 కిమీల దూరంలో ఉన్న ఐబక్ పట్టణంలో ఉన్న అల్ జిహాద్ మదరసాలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి స్కూల్ భవనం ధ్వంసమైంది. పేలుడు కారణంగా 16 మంది చనిపోయారు. సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 10 మందికి పైగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులే ఉన్నారు. ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, అఫ్గానిస్తాన్లో సాధారణ పౌరులు లక్ష్యంగా ఇటీవల జరిగిన పలు బాంబు దాడుల సమయంలో, ఆ దాడులకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో, ఈ దాడి కూడా ఐఎస్ పనేనని భావిస్తున్నారు.

Blast in Afghanistan దోషులను కఠినంగా శిక్షిస్తాం

అఫ్గానిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్ ఈ దాడిని ధ్రువీకరించింది. బాంబు దాడిలో 10 మంది విద్యార్థులు చనిపోయారని పేర్కొంది. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వారిని సాధ్యమైనంత త్వరగా కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. ఈ బాంబు దాడి అనంతరం మదరసాలోని భీతావహ దృశ్యాలున్న వీడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. ఐబక్ పట్టణం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. గతంలో బుద్ధిస్ట్ కేంద్రంగా విరాజిల్లింది. ఉత్తర దిశ నుంచి కాబూల్ కు వచ్చే వ్యాపారస్తులు అక్కడే తొలి విడిది చేసేవారు.

14:27 IST
  • Munugode Assembly : మునుగోడు ఉపఎన్నిక ముగిసింది. నేతలు అటువైపు చూడట్లేదని విమర్శలు మెుదలయ్యాయి. అయితే ఎన్నికల సమయంలో కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 1 కేటీఆర్ మునుగోడు వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల సమయంలో కేటీఆర్ దత్తత హామీ
ఎన్నికల సమయంలో కేటీఆర్ దత్తత హామీ

KTR Munugode Tour : దత్తత హామీ.. మునుగోడుకు కేటీఆర్

30 November 2022, 14:27 ISTHT Telugu Desk
30 November 2022, 19:57 IST
  • Munugode Assembly : మునుగోడు ఉపఎన్నిక ముగిసింది. నేతలు అటువైపు చూడట్లేదని విమర్శలు మెుదలయ్యాయి. అయితే ఎన్నికల సమయంలో కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 1 కేటీఆర్ మునుగోడు వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.

మునుగోడు ఉపఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్(Minister KTR) నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని, మునుగోడు(Munugode) అభివృద్ధిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ మేరకు కేటీఆర్ మునుగోడుకు వెళ్తున్నారు. సమీక్షా సమావేశానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు .

ట్రెండింగ్ వార్తలు

కేటీఆర్ తోపాటుగా మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఉదయం 11 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాల సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లను సమీక్షా సమావేశానికి పిలిచారు.

స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సమీక్ష జరగనుంది. పట్టణంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో భేటీ జరగనుంది. ఇప్పటికే.. చర్చించేందుకు మునుగోడు నియోజకవర్గ సమస్యలపై ఉన్నతాధికారులు నివేదికను రూపొందించినట్టుగా తెలుస్తోంది. రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు, మున్సిపాలిటీల్లో సమస్యలపై.. సమావేశం జరగొచ్చని అంచనా.

మునుగోడుకు కేటీఆర్
మునుగోడుకు కేటీఆర్
13:04 IST
  • Andhra Pradesh Politics : జనసేన, బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో జనసేనతోనే బీజేపీ పొత్తు ఉంటుందని విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

Union Minister : జనసేనతోనే బీజేపీ పొత్తు ఉంటుంది

30 November 2022, 13:04 ISTHT Telugu Desk
30 November 2022, 18:34 IST
  • Andhra Pradesh Politics : జనసేన, బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో జనసేనతోనే బీజేపీ పొత్తు ఉంటుందని విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన(Janasena)తోనే బీజేపీ పొత్తు అని.. విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. పవన్(Pawan)​తోనే ముందుకెళ్తామన్నారు. రాజమహేంద్రవరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జు​ల సమావేశంలో మురళీధరన్​ పాల్గొన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం లేదని మురళీ ధరన్ అన్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

'ఏపీ అభివృద్ధికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు లక్షల కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టాం. మరో రూ.30 వేల కోట్ల ఇతర ప్రాజెక్టులు మంజూరు చేశాం.' అని మురళీధరన్ న్నారు.

ఏపీ రాజకీయాల్లో(AP Politics) సమీకరణాలు రోజురోజు మారుతున్నాయి. కొత్త కొత్త వ్యూహాలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ(PM Modi) విశాఖ పర్యటన సందర్భంగా.. పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బీజేపీ-జనసేన పొత్తు కన్ఫామ్ అని చర్చ మెుదలైంది. అయితే మోదీతో సమావేశం తర్వాత.. మీడియా ముందుకు వచ్చిన పవన్.. అసలు విషయాలు మాత్రం చెప్పలేదు.

2014లో మోదీని కలిశానని... మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత కలిసినట్లు పవన్ తెలిపారు. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ భేటీ కొనసాగిందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) బాగుండాలి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారన్నారు. తెలుగు ప్రజల మధ్య ఐక్యత, ఏపీ ప్రజల బాగోగుల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఈ భేటీతో భవిష్యత్తులో ఏపీకి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు.

అయితే బీజేపీ(BJP) రాష్ట్రంలో అంత బలంగా లేకపోయినా.. పవన్ లాంటి నేతను కలుపుకొని వెళ్లి.. లబ్ధి పొందాలనుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. ఉపయోగపడుతుందనే ఇక్కడి పార్టీలు అనుకుంటున్నాయి. ఈ పొత్తులోకి చివరకు టీడీపీ కూడా చేరుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. మూడు పార్టీలు కలిసి వెళ్తే.. జగన్ ను ఎదుర్కొనేందుకు ఉపయోగం ఉంటుందని అభిప్రాయాలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు(BJP Leaders) మాత్రం.. జనసేనతోనే తమ పొత్తు అని.., టీడీపీతో ఉండనది స్పష్టం చేస్తున్నారు.

12:18 IST
  • Chandrababu Comments On CM Jagan : వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడం, ముఖ్యమంత్రికి చెంపదెబ్బ లాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివేకా తీర్పుపై జగన్​ సమాధానం చెప్పాలని, లేదంటే.. సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.
సీఎం జగన్ పై చంద్రబాబు కామెంట్స్
సీఎం జగన్ పై చంద్రబాబు కామెంట్స్

Chandrababu : నన్ను, లోకేశ్​ను చంపాలని చూస్తున్నారు

30 November 2022, 12:18 ISTHT Telugu Desk
30 November 2022, 17:48 IST
  • Chandrababu Comments On CM Jagan : వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడం, ముఖ్యమంత్రికి చెంపదెబ్బ లాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివేకా తీర్పుపై జగన్​ సమాధానం చెప్పాలని, లేదంటే.. సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చంద్రబాబు(Chandrababu) ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ(YCP)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్​కి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అని చంద్రబాబ ప్రశ్నించారు. బాబాయిని చంపిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించటం, ఇదేం ఖర్మ అని చంద్రబాబు విమర్శించారు. బాబాయ్​ని చంపినంత సులువుగా తనను చంపొచ్చని, ఇప్పుడు లోకేశ్​ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ చేసే.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

'జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరి అవకాశం. బాబాయిని చంపి అబద్ధాలు అల్లిన జగన్​కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. వైసీపీ గెలిస్తే మనకు రాజధాని అమరావతి(Capital Amaravati) ఉండదు. వివేకా హత్య కేసు(Viveka Murder Case) విచారణ తెలంగాణకు బదిలీ కావటం, జగన్ రెడ్డికి గట్టి చెంపదెబ్బ. తండ్రి హత్య కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court) వరకు సునీత చేసిన పోరాటాన్ని అంతా అభినందించాలి. తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని సునీత పోరాడుతున్నారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నారు.' అని చంద్రబాబు అన్నారు.

తన బాధ, ఆవేదన అంతా రాష్ట్రం కోసమేనని చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు నెల(Polavaram Project) వద్దకు వెళ్లి.. పనులను పరుగులు పెట్టించానని చెప్పారు. టీడీపీ(TDP) హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక..రివర్స్ టెండర్ తీసుకొచ్చారన్నారు. మూడు సంవత్సరాలో 72 శాతం పూర్తయితే.. జగన్ వచ్చాక.. మూడేళ్లలో డయాఫ్రమ్ వాల్ కూడా బాగు చేయలేదని విమర్శించారు. నిర్వాసితులకు ఆదుకోలేదన్నారు. పోలవరం కేంద్రం ప్రాజెక్టు అని, నిర్మాణానికి డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుందన్నారు.

'వైసీపీ గెలిస్తే పోలవరం(Polavaram) ముంచేస్తారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పాను. ముద్దులు పెడితే మోసపోవద్దు. పిడిగుద్దులు ఉంటాయని ఎప్పుడో అన్నాను. ప్రజల్లో చైతన్యం కోసమే ఇదేం ఖర్మ(Idhem Kharma) మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాం. మీలో చైతన్యం వచ్చి ధైర్యంగా ముందుకు రావాలి. ఏపీ రైతుల నెత్తిలో రూ.2.7 లక్షల తలసరి అప్పు ఉంది. మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరితాళ్లు వేస్తున్నారు.' అని చంద్రబాబు అన్నారు.

12:23 IST

Rifles, pistols and drugs recovered: పంజాబ్ లోని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సరిహద్దు భద్రత దళం(BSF) భారీగా ఆయుధాలను, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది.

భద్రతాసిబ్బంది స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
భద్రతాసిబ్బంది స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

Rifles, pistols and drugs recovered: పాక్ బోర్డర్లో ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం

30 November 2022, 12:23 ISTHT Telugu Desk
30 November 2022, 17:53 IST

Rifles, pistols and drugs recovered: పంజాబ్ లోని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సరిహద్దు భద్రత దళం(BSF) భారీగా ఆయుధాలను, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది.

పంజాబ్ పోలీసుల నుంచి అందిన సమాచారంతో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలో ఉన్న వాఖా గ్రామానికి చెందిన పంట పొలాల్లో ఈ ఆయుధాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Rifles, pistols and drugs recovered: భారీగా ఆయుధాలు

పంజాబ్ పోలీస్, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న వాఖా గ్రామ శివార్లలో వారు ఐదు ఏకే 47 రైఫిళ్లను, ఐదు పిస్టళ్లను, 9 మ్యేగజీన్లను స్వాధీనం చేసుకున్నారు. వాఖా గ్రామంలోని పంట పొలంలో పాతి పెట్టిన ఈ ఆయుధాలను వెలికితీశారు. గుజ్రంత్ సింగ్ కు చెందిన ఆ భూమి పాకిస్తాన్ సరిహద్దులోని బీఎస్ఎఫ్ ఔట్ పోస్ట్ కు 1.5 కిమీల దూరంలో ఉంది.

Rifles, pistols and drugs recovered: డ్రగ్స్ కూడా..

మరో చోట పోలీసులు 13 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. అమృతసర్, టార్న్ టారన్ జిల్లాల్లో పోలీసులు జరిపిన స్పెషల్ ఆపరేషన్లలో భారీ మొత్తంలో ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పాక్ భూభాగం నుంచి వచ్చిన రెండు డ్రోన్లను కూల్చి, ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి వచ్చే డ్రోన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు సుమారు 250 డ్రోన్లు భారత భూభాగం లోకి వచ్చాయి. 2021లో ఈ సంఖ్య 100 మాత్రమే.

టాపిక్

11:50 IST

Toyota Kirloskar's Vikram Kirloskar dies: భారత్ లోని టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ మరణించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో విక్రమ్ చనిపోయారని టయోటా కిర్లోస్కర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ (ఫైల్ ఫొటో)
టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ (ఫైల్ ఫొటో) (PTI)

Toyota Kirloskar's Vikram Kirloskar dies: విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం

30 November 2022, 11:50 ISTHT Telugu Desk
30 November 2022, 17:20 IST

Toyota Kirloskar's Vikram Kirloskar dies: భారత్ లోని టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ మరణించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో విక్రమ్ చనిపోయారని టయోటా కిర్లోస్కర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Toyota Kirloskar's Vikram Kirloskar dies: భారత్ లోని ప్రముఖ ఆటోమోటివ్ సంస్థల్లో ఒకటైన టయోటా కిర్లోస్కర్ కు వైస్ చైర్మన్ గా బాధ్యతల్లో ఉన్న విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం గుండెపోటుతో చనిపోయారు. భారత ఆటోమోటివ్ ఇండస్ట్రీకి విక్రమ్ కిర్లోస్కర్ ను పెద్ద దిక్కుగా భావిస్తారు. అత్యంత తీవ్రంగా గుండెపోటు రావడంతో మంగళవారం విక్రమ్ కిర్లోస్కర్ చనిపోయారని సంస్థ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Toyota Kirloskar's Vikram Kirloskar dies: బెంగళూరులో అంత్యక్రియలు..

విక్రమ్ కిర్లోస్కర్ అంత్యక్రియలు బంధు, మిత్రుల అశ్రునయనాల మధ్య బుధవారం బెంగళూరులోని హెబ్బల్ క్రెమటోరియంలో జరిగాయి. విక్రమ్ కిర్లోస్కర్ ఆకస్మిక మృతి పట్ల పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిర్లోస్కర్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. Vikram Kirloskar ఆకస్మిక మరణం తనను షాక్ కు గురిచేసిందని బయోకాన్ ఫార్మాస్యూటికల్స్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. విక్రమ్ తనకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. గీతాంజలి మానసికి, విక్రమ్ ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానన్నారు. విక్రమ్ హఠాన్మరణం పట్ల కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విక్రమ్ కిర్లోస్కర్(Vikram Kirloskar) తనకు మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. జపాన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టొయోటా భాగస్వామ్యంతో కిర్లోస్కర్ భారత్ లో విస్తృత శ్రేణి వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.

టాపిక్

11:16 IST
  • Mahindra recalls ScorpioN, XUV700: ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాలను మహింద్ర అండ్ మహింద్ర సంస్థ రీ కాల్ చేస్తోంది.
మహింద్ర స్కార్పియో ఎన్
మహింద్ర స్కార్పియో ఎన్

Mahindra recalls ScorpioN, XUV700: ఈ వాహనాలను రీకాల్ చేస్తున్న మహింద్ర!

30 November 2022, 11:16 ISTHT Telugu Desk
30 November 2022, 16:46 IST
  • Mahindra recalls ScorpioN, XUV700: ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాలను మహింద్ర అండ్ మహింద్ర సంస్థ రీ కాల్ చేస్తోంది.

Mahindra recalls ScorpioN, XUV700: క్లచ్ ప్లేట్లలో సమస్యను గుర్తించడంతో స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాలను మహింద్ర సంస్థ వెనక్కు తీసుకుంటోంది. ఆయా వాహనాలను కొనుగోలు చేసిన వారిని డీలర్లు వ్యక్తిగతంగా ఫోన్ చేసి, వివరాలు తెలియజేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Mahindra recalls ScorpioN, XUV700: క్లచ్ లో ప్రాబ్లం

క్వాలిటీ కంట్రోల్ గుర్తించని సమస్యను, వాహనాలు మార్కెట్లోకి వెళ్లిన తరువాత గుర్తించడంపై మహింద్ర సంస్థ దృష్టి పెట్టింది. 2022 జులై 1 నుంచి 2022 నవంబర్ 11 మధ్య ఉత్పత్తి చేసిన స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాల క్లచ్ భాగంలోని రబ్బర్ బెల్లోలో సమస్యను గుర్తించారు. దాంతో, ఆ సమయంలో ఉత్పత్తి చేసిన స్కార్పియో ఎన్(Scorpio-N), ఎక్స్ యూవీ 700(XUV700) వాహనాల కొనుగోలు దారులను సంప్రదించాలని సంస్థ డీలర్లను ఆదేశించింది. కార్లను వెనక్కు తీసుకుని, సమస్య ఉంటే, ఆ సమస్యను పరిష్కరించి, తిరిగివ్వాలని సూచించింది. ఇందుకు గానూ కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయరాదని స్పష్టం చేసింది.

Mahindra recalls ScorpioN, XUV700: ఎన్ని వాహనాలు..

2022 జులై 1 నుంచి నవంబర్ 11 మధ్య ఉత్పత్తి చేసిన, క్లచ్ రబ్బర్ బెల్లోలో సమస్య ఉండే అవకాశం ఉన్న 6,618 స్కార్పియో ఎన్(Scorpio-N) కార్లను 12,566 ఎక్స్ యూవీ 700(XUV700) కార్లను వెనక్కు తీసుకోనున్నారు. ఇవన్నీ కూడా మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ కార్లే. స్కార్పియో ఎన్(Scorpio-N) మోడల్ ను ఈ సంవత్సరం జూన్ లో మార్కెట్లో ప్రవేశపెట్టారు. అలాగే, ఎక్స్ యూవీ 700(XUV700) ను 2022 అక్టోబర్ లో మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ రెండు మోడళ్లలో కూడా 2.2 లీటర్ ఎంహాక్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ను అమర్చారు. Scorpio-N బుకింగ్స్ ను ప్రస్తుతానికి నిలిపేశారు. ఇప్పటికే, ఆ మోడల్ కు రెండు సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అలాగే, Mahindra XUV700 మోడల్ కు సంవత్సరం వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

టాపిక్

10:41 IST

Chinese ex President Jiang Zemin dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 96 ఏళ్లు. చైనాలో ఆర్థిక సంస్కరణలకు ఆయన గట్టి మద్దతుదారు.

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (ఫైల్ ఫొటో)
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (ఫైల్ ఫొటో) (REUTERS)

Chinese ex President Jiang Zemin dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మృతి

30 November 2022, 10:41 ISTHT Telugu Desk
30 November 2022, 16:11 IST

Chinese ex President Jiang Zemin dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 96 ఏళ్లు. చైనాలో ఆర్థిక సంస్కరణలకు ఆయన గట్టి మద్దతుదారు.

Chinese ex President Jiang Zemin dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. బ్లడ్ కేన్సర్ తో బాధపడుతూ, కొన్నాళ్లుగా షాంఘైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జెమిన్.. బహుళ అవయవ వైఫల్యంతో బుధవారం చనిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

Supporter of economic reforms: ఆర్థిక వృద్ధికి ఆద్యుడు

జియాంగ్ జెమిన్ 1993 నుంచి 2003 వరకు చైనా అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే, 1989 నుంచి 2002 వరకు శక్తిమంతమైన చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనే సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అనే పదాన్ని మొదట ఉపయోగించారు. జియాంగ్ జెమిన్ చైనాలో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టారు. మార్కెట్ అనుకూల సంస్కరణలకు మళ్లీ తెర తీశారు. జెమిన్ హయాంలో చైనా ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో పరుగులు తీసింది. ఆయన హయాంలోనే, 1997లో హాంకాంగ్ ను బ్రిటిష్ పాలన నుంచి చైనా ఆధీనంలోకి తీసుకువచ్చారు. అలాగే, జెమిన్ దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే. 2001లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(World Trade Organization)లో చైనా చేరింది. అలాగే, చైనా కమ్యూనిస్ట్ పార్టీలో చేరే అవకాశం పెట్టుబడిదారులకు కల్పించారు.

Jiang Zemin dies: హక్కుల కార్యకర్తలపై ఉక్కుపాదం

జియాంగ్ జెమిన్ హయాంలో మానవ హక్కుల కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు. వందలాదిగా ప్రజాస్వామ్య వాదులను జైలుపాలు చేశారు. ఫలున్ గాంగ్ స్పిరిచ్యువల్ మూవ్ మెంట్ ను నిషేధించారు. 2003లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగినప్పిటికీ.. అధికార కమ్యూనిస్ట్ కార్యకలాపాల్లో జెమిన్ క్రియాశీల పాత్ర పోషించారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు జిన్ పింగ్ కూడా జియాంగ్ జెమిన్ అనుసరించిన ఆర్థిక విధానాలు, కఠిన రాజకీయ ఆంక్షల విధానాన్నే అనుసరిస్తున్నారు.

Jiang Zemin dies: అంత్యక్రియలు ఎప్పుడు?

జియాంగ్ జెమిన్ మృతికి సంతాపంగా దేశవ్యాప్తంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేస్తారని చైనా అధికార మీడియా తెలిపింది. అంత్యక్రియలు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేస్తారనే విషయం త్వరలో ప్రకటిస్తారని వెల్లడించింది.

టాపిక్

9:32 IST
  • woman gang raped in Bengaluru: ర్యాపిడో బైక్ టాక్సి డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి 22 ఏళ్ల యువతిని రేప్ చేసిన ఘటన బెంగళూరులో జరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

woman gang raped in Bengaluru: బెంగళూరులో యువతి పై గ్యాంగ్ రేప్

30 November 2022, 9:32 ISTHT Telugu Desk
30 November 2022, 15:02 IST
  • woman gang raped in Bengaluru: ర్యాపిడో బైక్ టాక్సి డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి 22 ఏళ్ల యువతిని రేప్ చేసిన ఘటన బెంగళూరులో జరిగింది.

woman gang raped in Bengaluru: బాధితురాలి వయస్సు 22 సంవత్సరాలు అని, ఆమెది కేరళ అని, బెంగళూరులో ఉద్యోగం చేస్తోందని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rapido bike driver rapes a woman: ర్యాపిడి బైక్ టాక్సీ

ఎలక్ట్రానిక సిటీ సమీపంలో ఉండే బాధితురాలు శనివారం రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లడం కోసం ర్యాపిడో బైక్ టాక్సీని హైర్ చేసుకుంది. బైక్ డ్రైవర్ దారి మళ్లించి, ఆమెను తనుండే ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ డ్రైవర్, అతడి మరో స్నేహితుడు ఆ యువతిపై అత్యాచారం చేశారు. వారికి అక్కడే ఉన్న మరో యువతి సహకరించింది. అనంతరం ఆ యువతిని కొంత దూరంలో రోడ్డుపై వదిలేశారు.

woman gang raped in Bengaluru: హాస్పిటల్ కు వెళ్లడంతో..

ఆ బాధిత యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, ముఖ్యంగా మర్మావయవాల వద్ద తీవ్రమైన నొప్పి వస్తుండడంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఆమె పరిస్థితిని గమనించిన ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం, బాధిత యువతి నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి ఇచ్చిన సమాచారం ప్రకారం.. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ప్రాంతంలో సాక్ష్యాధారాలను సేకరించారు. నిందితుల్లో ఒకరు ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ కాగా, మరొకరు ఒక మొబైల్ స్టోర్ లో పని చేస్తుంటాడు. నేరానికి సహకరించిన యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టాపిక్

10:39 IST
  • Crime News : ఒక్కోసారి చిన్న క్లూ చాలు.. నిందితుడు దొరికిపోయేందుకు. గుండు సూది మీద అనుమానం వచ్చినా.. పోలీసులు దర్యాప్తు చేసి.. నేరుగా నిందితుడి దగ్గరకు వెళ్తారు. ఇదంతా ఎందుకంటే.. బైక్ దొంగిలించిన వ్యక్తిని హెల్మెట్ పట్టించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

BIke Theft : అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. దొంగను పట్టించిన హెల్మెట్

30 November 2022, 10:39 ISTHT Telugu Desk
30 November 2022, 16:09 IST
  • Crime News : ఒక్కోసారి చిన్న క్లూ చాలు.. నిందితుడు దొరికిపోయేందుకు. గుండు సూది మీద అనుమానం వచ్చినా.. పోలీసులు దర్యాప్తు చేసి.. నేరుగా నిందితుడి దగ్గరకు వెళ్తారు. ఇదంతా ఎందుకంటే.. బైక్ దొంగిలించిన వ్యక్తిని హెల్మెట్ పట్టించింది.

ఎక్కడో బైక్ దొంగతనం చేసి.. మరెక్కడో అమ్మేయాలని ఓ వ్యక్తి ప్లాన్ చేశాడు. బైక్(Bike) దొంగతనం చేశాడు. హైవే(Highway) ఎక్కి.. జాలీగా పాటలు పాడుకుంటూ వెళ్లిపోయాడు. ఇక బైక్ అమ్మేస్తే.. అయిపోద్దానే భ్రమాల్లో ఉన్నాడు. బాధితుడు అప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తన బైక్ పోయిందని తెలిపాడు. కేవలం హెల్మెట్ ఆధారంగా.. పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి పట్టేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌(secunderabad)లోని సంగీత్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలో బైక్‌ చోరీకి గురైంది. రియాజుద్దీన్‌ అనే వ్యక్తి.. బైక్‌పై దొరికిన హెల్మెట్‌ను ధరించి కామారెడ్డికి విక్రయించేందుకు వెళ్లాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు(Police) సీసీ టీవీ ఫుటేజీని చూడటం మెుదలుపెట్టారు. హెల్మెట్ రంగు కాస్త భిన్నంగా పింక్ కలర్ లో ఉంది. ఇదే పాయింట్ పట్టుకున్నారు పోలీసులు. రంగు కారణంగా పోలీసులు సులభంగా ట్రాక్ చేయగలిగారు.

హైవేపై ఉన్న రెండు టోల్ ప్లాజాల నుంచి సికింద్రాబాద్ టూ కామారెడ్డి(Kamareddy) వరకు 30 సీసీటీవీ కెమెరాల(CCTV Cameras) నుంచి ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. నేరుగా రియాజుద్దీన్ వరకు వెళ్లారు. దీంతో నిందితుడు షాక్ అయ్యాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అతడి వద్ద చోరీకి గురైన మరో పది బైకులు కూడా ఉన్నాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలతో సహా అతడిని పట్టుకున్నారు.

గల్ఫ్‌లో ఉన్నప్పుడు రియాజుద్దీన్‌కు ఆరోగ్య సమస్యలు(Health Problems) వచ్చాయి. తన చికిత్స కోసం పొదుపును ఖర్చు చేశాడని విచారణలో తేలింది. గల్ఫ్‌లో ఉన్న అతడిని పట్టించుకునే వారు లేకపోవడంతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అతని స్నేహితులు ఇంటికి తిరిగి రావడానికి సహకరించారు. ఆర్థిక పరిస్థితులు దారణంగా తయారయ్యాయి.

తన కుటుంబాన్ని నడపడానికి బంధువులు, స్నేహితుల దగ్గర రియాజుద్దీన్ అప్పులు చేశాడు. దొంగిలించిన బైక్‌లను విక్రయించి.. ఆ సొమ్మును అప్పులు తీర్చేందుకు, ఇంటి అవసరాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. రియాజుద్దీన్ పింక్ హెల్మెట్ ధరించడం వల్ల సులభంగా ట్రాక్ చేసి పట్టుకున్నామని వెల్లడించారు.

9:38 IST
  • India vs New Zealand 3rd ODI: వర్షంతో మూడో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. తొలి వన్డే గెలిచిన న్యూజిలాండ్‌ సిరీస్‌ను 1-0తో ఎగరేసుకుపోయింది. రెండో వన్డే కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిన మూడో వన్డే
వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిన మూడో వన్డే (AP)

India vs New Zealand 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు.. సిరీస్‌ గెలిచిన న్యూజిలాండ్

30 November 2022, 9:38 ISTHari Prasad S
30 November 2022, 15:08 IST
  • India vs New Zealand 3rd ODI: వర్షంతో మూడో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. తొలి వన్డే గెలిచిన న్యూజిలాండ్‌ సిరీస్‌ను 1-0తో ఎగరేసుకుపోయింది. రెండో వన్డే కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

India vs New Zealand 3rd ODI: టీమిండియా మూడో వన్డే ఓడకుండా వరుణుడు కాపాడాడు. అయితే సిరీస్‌ మాత్రం న్యూజిలాండ్‌ సొంతమైంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. తొలి వన్డేలో గెలిచిన న్యూజిలాండ్‌ 1-0తో సిరీస్‌ను గెలుచుకుంది. అచ్చూ టీ20 సిరీస్‌లాగే వన్డే సిరీస్‌ ముగిసినా.. ఫలితం తారుమారైంది.

ట్రెండింగ్ వార్తలు

బుధవారం (నవంబర్ 30) జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 219 రన్స్‌కే చాప చుట్టేయగా.. తర్వాత న్యూజిలాండ్‌ చేజింగ్‌ను ధాటిగా మొదలుపెట్టింది. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి ఆ టీమ్‌ 18 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 104 రన్స్‌ చేసింది. మరో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే మ్యాచ్‌లో ఫలితం వచ్చేది.

అప్పటికే డీఎల్‌ఎస్‌ స్కోరు కంటే న్యూజిలాండ్‌ 50 పరుగులు ముందే ఉన్నా.. కనీసం 20 ఓవర్ల ఆట పూర్తి కాకపోవడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 18వ ఓవర్‌ ముగిసిన తర్వాత మొదలైన వర్షం కురుస్తూనే ఉంది. ఆ తర్వాత మ్యాచ్‌ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం..

అంతకుముందు టీమిండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 47.3 ఓవర్లలో భారత్ 219 పరుగులకు ఆలౌటైంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. వాషింగ్టన్ సుందర్(51) అర్ధశతకం, శ్రేయాస్ అయ్యర్ 49 పరుగులు మినహా మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆరంభం నుంచి టీమిండియా ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. మరోపక్క కివీస్ బౌలర్లలో ఆడం మిల్నే, డారిల్ మిచెల్ చెరో 3 వికెట్లతో అదరగొట్టగా.. టిమ్ సౌథీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ప్రారంభం నుంచి ఓపెనర్లు నిదానంగా ఆడటంతో 9 ఓవర్లకు 39 పరుగులే చేయగలిగింది. ఆ సమయలో శుబ్‌మన్ గిల్‌ను(13) ఔట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. ఆ కాసేపటికే శిఖర్ ధావన్‌ను(28) కూడా బౌల్డ్ చేయడంతో భారత పతనం ప్రారంభమైంది. అనంతరం రిషబ్ పంత్(10) కూడా డారిల్ మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(6) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలుచోలేకపోయాడు. ఆడం మిల్నే బౌలింగ్‌లో సౌధీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఓ పక్క శ్రేయాస్ అయ్యర్(49) బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును కాస్త ముందుకు నడిపించాడు. అతడు ఉన్నంత సేపు స్కోరు ఫర్వాలేదనిపించింది. అయితే సూర్యకుమార్ ఔటైన తర్వాత అతడు లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత్ కష్టాలు మొదలయ్యాయి. 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో నిలిచింది. బ్యాటర్లంతా ఔట్ కావడంతో ఓ దశలో 150 పరుగులైనా చేస్తుందా అనే సందేహం వచ్చింది.

ఇలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్(51) ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్ల సహాయంతో మరో 97 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ.. సుందర్ ఏ మాత్రం అవకాశమివ్వలేదు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. టెయిలెండర్లు అండతో టీమిండియాకు ఓ మోస్తరు స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ నమోదు చేశాడు. సిక్సర్‌తో పరుగులు పూర్తి చేశాడు. 64 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. మొత్తానికి 47.3 ఓవర్లలో 210 పరుగులకు టీమిండియా ఆలౌటైంది.

8:59 IST
  • Telangana Student : ఓ అమ్మాయి కాలేజీకి వచ్చింది. లెక్చరర్ పాఠాలు చెబుతుండగా ఫొటో తీసి బోరింగ్ క్లాస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం కాస్త లెక్చరర్ కు తెలిసింది. ఆమె రియాక్షన్ తో కథ రివర్స్ అయింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

Social Media Post : 'సోది క్లాస్' అంటూ స్టూడెంట్ పోస్ట్.. లెక్చరర్ కు తెలిసి..

30 November 2022, 8:59 ISTHT Telugu Desk
30 November 2022, 14:29 IST
  • Telangana Student : ఓ అమ్మాయి కాలేజీకి వచ్చింది. లెక్చరర్ పాఠాలు చెబుతుండగా ఫొటో తీసి బోరింగ్ క్లాస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం కాస్త లెక్చరర్ కు తెలిసింది. ఆమె రియాక్షన్ తో కథ రివర్స్ అయింది.

లెక్చరర్ పాఠాలు చెబుతుండగా.. ఫొటో తీసి ఓ విద్యార్థి సోషల్ మీడియా(Social Meida)లో పెట్టింది. పోస్టుకు బోరింగ్ క్లాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ విషయం తెలిసిన లెక్చరర్ క్లాస్ అందరినీ చితకబాదింది. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) జిల్లా మద్నూర్ మండలం మేనూర్ ఆదర్శ (మోడల్)స్కూల్ లో జరిగింది. దీనిపై తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు(Police) ఫిర్యాదు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

ఇంటర్ ఫస్ట్ ఇయర్(Inter First Year) విద్యార్థులకు లెక్చరర్ మహేశ్వరి పాఠం చెబుతోంది. వింటున్నట్టుగానే ఉన్నారు స్టూడెంట్స్. అందులో ఒక అమ్మాయి.. లెక్చరర్ పాఠం చెబుతుండగా.. ఫోన్లో ఫొటో తీసింది. బోరింగ్ క్లాస్ అంటూ సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసింది. ఈ విషయం ఎలాగోలా లెక్చరర్ కు తెలిసింది. వెళ్లి నేరుగా విద్యార్థినిని అడిగింది. నా ఫొటో సోషల్ మీడియాలో ఎందుకు పెట్టావని ప్రశ్నించింది. అసలు క్లాస్ రూమ్ కు ఫోన్ తీసుకురావడమే తప్పని చెప్పింది

దీంతో భయపడిని స్టూడెంట్ తప్పును ఒప్పుకుంది. క్షమించమని అడిగింది. తన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా.. బోరింగ్ క్లాస్ అని క్యాప్షన్(Caption) ఇవ్వడంపై టీచర్ కోపంతో ఉంది. గది తలుపు పెట్టేసి.. అమ్మాయిలను ఒక చోట నెలబెట్టి.. కర్రతో చికతబాదింది. లెక్చరర్ అమ్మాయిలను కొడుతున్నప్పుడు కొంతమంది బాయ్స్ వీడియో తీశారు. అదికాస్త వైరల్ అయింది.

మరోవైపు బాలికలు తమను లెక్చరర్ ఎలా కొట్టిందో ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేశారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. లెక్చరర్ తో గొడవకు దిగారు. తమ పిల్లలను ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. తన ఫొటోను సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారని.. ఆ అవసరం ఏంటని.. అందుకే కొట్టానని లెక్చరర్ మహేశ్వరి ఒప్పుకుంది. ఈ ఘటన ఉన్నతాధితారుల వరకూ వెళ్లింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రన్సిపల్ లావణ్య చెప్పారు. లెక్చరర్ మీద ఓ విద్యార్థిని మద్నూర్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశారు. మాట్లాడుకుని.. సెటిల్ చేసుకుంటే అయిపోయేదానికి ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నారని స్థానికులు అంటున్నారు.

9:32 IST
  • CM Jagan On Education : పిల్లల చదవుకు పెట్టే ఖర్చును వ్యయంగా చూడకుండా ఆస్తిగా భావిస్తున్నాని సీఎం జగన్ చెప్పారు. పేదరికం వారి చదువుకు ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

CM Jagan : పిల్లల చదువుకు పెట్టే ఖర్చు ఆస్తిగా భావిస్తున్నా

30 November 2022, 9:32 ISTHT Telugu Desk
30 November 2022, 15:02 IST
  • CM Jagan On Education : పిల్లల చదవుకు పెట్టే ఖర్చును వ్యయంగా చూడకుండా ఆస్తిగా భావిస్తున్నాని సీఎం జగన్ చెప్పారు. పేదరికం వారి చదువుకు ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యాదీవెన పథకం(Jagananna vidya deevena) నిధులను బటన్​ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకే జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

'పిల్లల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదు. వారికి మనం ఇచ్చే ఆస్తి చదువే. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి.. 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకే జమ చేశాం. విద్యాదీవెన, వసతిదీవెనకు రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టాం.' అని సీఎం జగన్(CM Jagan) అన్నారు.

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం జగన్ అన్నారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయని తెలిపారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు

కుటుంబాల తలరాత మారాలంటే, పేదరికం దూరం కావాలంటే, చదువు(education) మార్గమని సీఎం జగన్(CM Jagan) అన్నారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించామని జగన్ చెప్పారు.

'జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన(Jagananna Vasathi Deevena) కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తం రూ.12,401 కోట్లు ఇచ్చాం. డైరెక్ట్ గా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానను భరోసా ఇస్తున్నాను. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటాను. మీ పిల్లలను పూర్తిగా చదవించే బాధ్యత నాది. పిల్లల చదవుతో ఇంటింటా.. వెలుగు నింపాలని నాడు నేడు(Nadu Nedu) కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. ఉపాధిగా చేరువగా విద్యారంగాన్ని తీసుకెళ్తున్నాం.' అని సీఎం జగన్ అన్నారు.

ఉన్నత విద్యలో కూడా మార్పులు తెచ్చామని సీఎం జగన్(CM jagan) చెప్పారు. ప్రఖ్యాత కంపెనీల సర్టిఫైడ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి కింద రూ.19,617 కోట్లు, జగనన్న విద్యాకానుకకు రూ.2,368 కోట్లు విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లకు రూ.685 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. మెుత్తం కలిపి మూడు సంవత్సరాల్లో విద్యారంగానికి 55 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

9:07 IST
  • 37 lakh Fraud: కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ మోసగాడు.. వృద్ధుడి నుంచి రూ.37లక్షలు దోచేశాడు. అసలు ఈ మోసం ఎలా జరిగిందంటే..
ప్రతీకారాత్మక చిత్రం
ప్రతీకారాత్మక చిత్రం

Fraud: కస్టమర్ కేర్ నుంచి అంటూ రూ.37లక్షలు దోచేశాడు.. భారీ మోసం!

30 November 2022, 9:07 ISTChatakonda Krishna Prakash
30 November 2022, 14:37 IST
  • 37 lakh Fraud: కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ మోసగాడు.. వృద్ధుడి నుంచి రూ.37లక్షలు దోచేశాడు. అసలు ఈ మోసం ఎలా జరిగిందంటే..

37 lakh Fraud: ఓ బ్యాంకుకు చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‍ను అంటూ ఓ మోసగాడు ఏకంగా రూ.37లక్షలు దోచేశాడు. 76 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి అకౌంట్లలోని డబ్బులతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా కొల్లగొట్టాడు. కొంత సమయంలోనే ఈ దగా చేశాడు. గురుగ్రామ్‍లో జరిగింది ఈ ఘరానా మోసం.

ట్రెండింగ్ వార్తలు

మోసం జరిగిందిలా..

37 lakh Fraud: న్యూ గురుగ్రామ్‍లో నివాసం ఉంటున్న 76ఏళ్ల హరీశ్ చందర్‌ ఫోన్‍కు ఓ మెసేజ్ వచ్చింది. కొత్త క్రెడిట్ కార్డ్ మీ అడ్రస్‍కు డెలివరీ చేయలేమంటూ అందులో ఉంది. ఆ తర్వాత కాసేపటికే క్రెడిట్ కార్డ్ డెలివరీ అయిందంటూ మరో మెసేజ్ వచ్చింది.

దీంతో కంగారు పడిన హరీశ్ చందర్.. ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఇంటర్నెట్‍లో సెర్చ్ చేశారు. ఆ సమయంలో సెర్చ్ రిజల్ట్స్ లో ఆ బ్యాంక్ కస్టమర్ కేర్ అంటూ ఓ నంబర్ హైలైట్ అయి కనిపిచింది.

ఇంటర్నెట్‍లో కనిపించిన ఆ నంబర్‌కు హరీశ్ చందర్ కాల్ చేశారు. అయితే ఆ నంబర్ కస్టమర్ కేర్‌ది కాదు. అయినా సరే అవతలి వ్యక్తి తాను కస్టమర్ కేర్ నుంచే మాట్లాడుతున్నానని హరీశ్ చందర్ కు చెప్పాడు. మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

37 lakh Fraud: అడ్రస్ అప్‍డేట్ చేసేందుకు ముందుగా బ్యాంక్ వివరాలన్నీ చెప్పాలని హరీశ్ చందర్‌ను ఆ మోసగాడు అడిగాడు. నిజంగా కస్టమర్ కేర్ అధికారే అనుకొని ఆయన అన్ని వివరాలు చెప్పారు. ఆ తర్వాత హరీశ్ చందర్ ఫోన్‍కు ఆ మోసగాడు ఓ రిమోట్ యాక్సెస్ యాప్ లింక్‍ను పంపి డౌన్‍లోడ్ చేసుకునేలా చేశాడు. ఆ తర్వాత ఫోన్‍ను ఆధీనంలోకి తీసుకొని బ్యాంకు ఖాతాల్లోని డబ్బును, ఎఫ్‍డీలను కూడా ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు.

జీవితాంతం కూడబెట్టుకున్న డబ్బు

37 lakh Fraud: మోసగాడు.. తనతో ఎలాంటి అనుమానం రాకుండా మాట్లాడడని హరీశ్ చందర్ చెప్పారు. “అతడు నమ్మకం కలిగించే విధంగా మాట్లాడాడు. సెక్యూరిటీ కారణాల కోసం ఈ కాల్‍ను రికార్డ్ చేస్తున్నామని, ఎలాంటి భయం అవసరం లేదన్నాడు. అతడు మోసగాడని నేను గుర్తించలేకపోయాను. నేను జీవితాంతంత కూడబెట్టుకునే డబ్బు పోగొట్టుకున్నాను” అని హరీశ్ చందర్ చెప్పారు.

ఐటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్‍ల కింద కేసు నమోదు చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు.. మోసగాడిని పట్టుకునే పనిలో ఉన్నారు.

9:07 IST
  • Argentina Knock out chances: అర్జెంటీనా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్తుందా.. ఇప్పుడందరిలోనూ ఇదే సందేహం. తొలి మ్యాచ్‌లోనే సౌదీ చేతుల్లో ఓడినా.. తర్వాత మెక్సికోపై గెలిచి నిలిచిన ఆ టీమ్‌కు పోలాండ్‌ రూపంలో బుధవారం (నవంబర్ 30) మరో పరీక్ష ఎదురు కానుంది.
చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో అర్జెంటీనా
చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో అర్జెంటీనా (REUTERS)

Argentina Knock out chances: అర్జెంటీనా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్తుందా? పోలాండ్‌తో మ్యాచ్‌ డ్రా అయితే ఎలా?

30 November 2022, 9:07 ISTHari Prasad S
30 November 2022, 14:37 IST
  • Argentina Knock out chances: అర్జెంటీనా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్తుందా.. ఇప్పుడందరిలోనూ ఇదే సందేహం. తొలి మ్యాచ్‌లోనే సౌదీ చేతుల్లో ఓడినా.. తర్వాత మెక్సికోపై గెలిచి నిలిచిన ఆ టీమ్‌కు పోలాండ్‌ రూపంలో బుధవారం (నవంబర్ 30) మరో పరీక్ష ఎదురు కానుంది.

Argentina Knock out chances: ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్‌ స్టేజ్‌ దగ్గరవుతున్న కొద్దీ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌లాంటి టీమ్స్ రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించాయి. అటు గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి నుంచి నెదర్లాండ్స్‌, సెనెగల్, ఇంగ్లండ్, యూఎస్‌ఏ కూడా నాకౌట్‌ రౌండ్‌లో అడుగుపెట్టాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇక బుధవారం(నవంబర్‌ 30) గ్రూప్‌ సి, గ్రూప్‌ డిలోని టీమ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. బుధవారంతో ఈ రెండు గ్రూప్‌లలోని టీమ్స్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లను ఆడబోతున్నాయి. వీటిలో అర్జెంటీనా కూడా ఉంది. ఆ టీమ్‌కు పోలాండ్‌ రూపంలో అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది.

అర్జెంటీనా క్వాలిఫై అవుతుందా?

బుధవారం జరగబోయే మ్యాచ్‌లలో అందరి కళ్లూ అర్జెంటీనా, మెస్సీపైనే ఉన్నాయి. ఆ టీమ్‌ తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తుందా లేక తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పడుతుందా అన్నది తేలనుంది. గ్రూప్‌ సిలో టాపర్‌గా ఉన్న పోలాండ్‌తో చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే అర్జెంటీనా రౌండ్‌ ఆఫ్‌ 16కు వెళ్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ డ్రా అయితే పోలాండ్‌ రౌండ్‌ ఆఫ్‌ 16కు వెళ్తుంది.

అటు అర్జెంటీనా మాత్రం మరో మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాను మెక్సికో ఓడించాలి. అదే సమయంలో గోల్‌ డిఫరెన్స్‌తో అర్జెంటీనా కంటే మెక్సికో వెనుక ఉండాలి. లేదంటే ఈ ఇద్దరి మ్యాచ్‌ డ్రా కావాలి. సౌదీ అరేబియా నాకౌట్‌కు చేరాలంటే కచ్చితంగా మెక్సికోను ఓడించాలి. మెక్సికో రౌండ్‌ ఆఫ్‌ 16 చేరాలంటే సౌదీని ఓడించడంతోపాటు అటు అర్జెంటీనాను పోలాండ్‌ ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అర్జెంటీనా కంటే గోల్స్‌ డిఫరెన్స్‌లో పైచేయి సాధించాలి.

ఆ లెక్కన చూస్తే అర్జెంటీనాకు ఇది అగ్ని పరీక్షే అవుతుంది. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాకౌట్‌ చేరాలంటే పోలాండ్‌ను కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. అయితే అది అంత సులువైన పనిలా కనిపించడం లేదు. తొలి మ్యాచ్‌లో సౌదీ చేతుల్లో ఓడటం అర్జెంటీనా అవకాశాలను సంక్లిష్టం చేసిన విషయం తెలిసిందే.

8:48 IST
  • RC 15 Update: కియారా స్టన్నింగ్‌గా ఉందని అన్నాడు రామ్‌చరణ్‌. ఆర్సీ 15 టీమ్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుందని చెబుతూ అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెపై ప్రశంసలు కురిపించాడు.
న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కేక్ కట్ చేస్తున్న ఆర్సీ15 టీమ్
న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కేక్ కట్ చేస్తున్న ఆర్సీ15 టీమ్

RC 15 Update: కియారా స్టన్నింగ్‌గా ఉందంటున్న రామ్‌చరణ్‌

30 November 2022, 8:48 ISTHT Telugu Desk
30 November 2022, 14:18 IST
  • RC 15 Update: కియారా స్టన్నింగ్‌గా ఉందని అన్నాడు రామ్‌చరణ్‌. ఆర్సీ 15 టీమ్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుందని చెబుతూ అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెపై ప్రశంసలు కురిపించాడు.

RC 15 Update: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌ శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఆర్సీ 15. ఈ సినిమా షూటింగ్‌ వాయిదాల పద్ధతిలో జరుగుతున్నా.. ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో శంకర్‌ అటు ఇండియన్ 2 మూవీ కూడా తీస్తుండటంతో ఆర్సీ 15కు అడ్డంకులు తప్పడం లేదు. అయితే తాజాగా ఆర్సీ15 టీమ్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భాన్ని కేక్‌ కట్‌ చేసుకొని ఆ టీమ్ సెలబ్రేట్‌ చేసుకుంది. న్యూజిలాండ్‌లో షెడ్యూల్‌ పూర్తయిన విషయాన్ని రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. అక్కడ తమ షూటింగ్‌ లొకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేసుకున్నాడు. తాను సింగిల్‌గా ఉన్న ఓ హ్యాండ్సమ్‌ లుక్‌ ఫొటోతోపాటు టీమ్‌ కేక్‌ కట్‌ చేసిన ఫొటో, మరికొన్ని ఇతర ఫొటోలను షేర్‌ చేశాడు.

ఈ సందర్భంగా కియారాతోపాటు ఇతర టీమ్‌ సభ్యులపై చరణ్‌ ప్రశంసలు కురిపించాడు. "న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ ముగిసింది. పాట, దాని విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. శంకర్‌ గారు దానిని మరింత స్పెషల్‌గా మార్చారు. ఎప్పటిలాగే కియారా స్టన్నింగ్‌గా ఉంది. తమన్‌ మరోసారి ఇరగదీశాడు" అనే క్యాప్షన్‌తో చెర్రీ ఈ ఫొటోలను షేర్‌ చేసుకున్నాడు.

కొన్ని రోజులుగా ఆర్సీ 15 టీమ్‌ నుంచి న్యూజిలాండ్‌ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. లొకేషన్‌లో కియారా, రామ్‌చరణ్‌ బర్గర్లు తింటూ ఎంజాయ్ చేస్తున్న ఫొటో కూడా అందులో ఒకటి.

ఆర్సీ 15 మూవీని దిల్ రాజు, శిరీష్‌ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌, కియారాతోపాటు ఎస్‌జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి స్క్రిప్ట్‌ కార్తిక్‌ సుబ్బరాజు అందించగా.. మ్యూజిక్‌ తమన్‌ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

8:33 IST
  • Beetroot for Beauty : బీట్‌రూట్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, టాన్‌ను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే ఇంట్లోనే బీట్‌రూట్‌తో ఫేషియల్ చేసుకోవచ్చు. మూడు-దశల్లో చేసుకునే ఈ ఫేషియల్ పార్లర్ కంటే మెరుగైన ఫలితాలు ఇస్తుంది.
8:15 IST
  • Anti Hijab Protests: ఫిఫా ప్రపంచకప్‍ (FIFA World cup) లో భాగంగా మైదానంలో అమెరికాతో ఇరాన్ తలపడుతుంటే.. ఆ దేశ ఫ్యాన్స్ మాత్రం స్టేడియం బయట తలపడ్డారు. ఇరాన్ అభిమానులు రెండు గ్రూప్‍లుగా విడిపోయి కొట్టుకున్నారు. ఫిఫా ప్రపంచకప్‍ను చూసేందుకు ఖతార్‍కు చాలా మంది ఇరాన్ దేశస్థులు వచ్చారు. అయితే మ్యాచ్‍ల కోసమే కాకుండా హిజాబ్‍పై తమ స్వరాన్ని ప్రపంచానికి చెప్పేందుకు కూడా కొందరు వచ్చారు. అమెరికాతో ఇరాన్ మ్యాచ్ పూర్తయిన తర్వాత దోహా స్టేడియం బయట కొందరు ఇరాన్ ప్రజలు.. హిజాబ్‍కు వ్యతిరేకంగా నిరసన చేశారు. అదే సమయంలో ప్రో-ఇస్లామిక్ వాదులు వారితో వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
8:14 IST
  • Pushpa Team In Russia: పుష్ప టీమ్ రష్యాలో సందడి చేసింది. ఆ సినిమా డిసెంబరు 8న అక్కడ విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్ల కోసం చేరుకుంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా, సుకుమార్ తదితురులు అక్కడకు చేరుకున్నారు.
రష్యా చేరుకున్న పుష్ప టీమ్
రష్యా చేరుకున్న పుష్ప టీమ్

Pushpa Team in Russia: రష్యాలో పుష్ప టీమ్ సందడి.. అల్లు అర్జున్, రష్మిక తగ్గేదేలే

30 November 2022, 8:14 ISTMaragani Govardhan
30 November 2022, 13:44 IST
  • Pushpa Team In Russia: పుష్ప టీమ్ రష్యాలో సందడి చేసింది. ఆ సినిమా డిసెంబరు 8న అక్కడ విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్ల కోసం చేరుకుంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా, సుకుమార్ తదితురులు అక్కడకు చేరుకున్నారు.

Pushpa Team In Russia: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదైలన చిత్రాన్నింటిలోనూ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా రిలీజై ఏడాది అవుతున్నప్పటికీ దీని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈ సినిమా రష్యాలో విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబరు 8న అక్కడ థియేటర్లలో రష్యా ప్రేక్షకులను పలకరించనుంది. దీంతో ప్రమోషన్ల కోసం చిత్రబృందం రష్యా చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు

అల్లు అర్జున్‌తో పాటు రష్మికా మందన్నా, దర్శకుడు సుకుమార్ రష్యాకు వెళ్లారు. చిత్ర ప్రమోషన్లలో భాగంగా రష్యాలో పలు ప్రీమియర్లకు వీరు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే రష్యన్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. రష్యా చేరుకున్న పుష్ప టీమ్‌కు సాదర స్వాగతం లభించింది. అక్కడ విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు.

డిసెంబరు 1న మాస్కోలో, 3వ తేదీన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు మేకర్స్. మాస్కోలో జరిగే ప్రీమియర్ షోలో అల్లు అర్జున్, రష్మికాతో పాటు దర్శకుడు సుకుమార్, నిర్మాత రవిశంకర్ పాల్గొని అక్కడి మీడియాతో మాట్లాడనున్నారు. మరి రష్యాలో ఈ చిత్రం ఎన్ని రికార్డులను సృష్టించనుందో వేచి చూడాలి.

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రష్యాలో రీ రిలీజ్ చేయనుండటంతో కాస్త గ్యాప్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. అల్లు అర్జున్, రష్మికా మందన్నా, ఫహాద్ ఫాజిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

రష్యాలో పుష్ప బృందానికి సాదర స్వాగతం
రష్యాలో పుష్ప బృందానికి సాదర స్వాగతం

Loading...